
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఆమె.. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతోపాటు ఎనర్జీటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే.. మరోవైపు కుర్రహీరోలస సరసన నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తెలుగులో ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే వరుసగా ప్లాపులు వస్తున్నప్పటికీ శ్రీలీల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే పరాశక్తి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ధనుష్ సరసన మరో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో కాలేజీ కుర్రాళ్లతో కలిసి సందడి చేసింది శ్రీలీల.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల జూబిలేషన్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. అక్కడు విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసింది. అలాగే తన స్పీచ్ తో ఆకట్టుకుంది. కాలేజ్ ఫెస్టులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపింది. ఒంగోలు తన అమ్మమ్మ, తాతయ్యల ఊరు అని తెలిపింది. మిమ్మల్ని చూసిన జోష్ లో అరిచి అరిచి గొంతు పోయిందని చెప్పింది. ఈ క్రమంలోనే శ్రీలీల డ్యాన్స్ చేయాలంటూ స్టేజ్ దగ్గరున్న కుర్రాళ్ల గట్టిగా అరిచారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
డ్యాన్స్ చెయ్ అంటూ అబ్బాయిలు అరవడంతో శ్రీలీల స్పందిస్తూ.. “నిజంగా పెళ్లాన్ని అడిగినట్లు అడిగారు. డ్యాన్స్ చేద్దాం కమాన్” అంటూ మాట్లాడింది శ్రీలీల. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీనిపై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..