
వరుస అపజయాలు ఎదురవుతున్నా శ్రీలీల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. మొన్నటి రాబిన్ హుడ్ వరకు శ్రీలీల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మనే ట్రెండింగ్ హీరోయిన్. ప్రస్తుతం శ్రీలీల జూనియర్ అనే ఓ సినిమాలో నటిస్తోంది. మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న జూనియర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ కు మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక జూనియర్ మూవీపై హైప్ ఉండానికి ప్రధాన కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీల కారణంగానే ఈ మూవీపై ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
జూనియర్ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన ‘వైరల్ వయ్యారి’ అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తోన్న శ్రీలీల కొత్త హీరోతో చేసేందుకు గట్టిగానే రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది శ్రీలీల. అయితే జూనియర్ కోసం మాత్రం ఆమెకు రూ.4 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్ నడుస్తోంది. కాగా బెంగళూరులోనే పుట్టి పెరిగిన శ్రీలీల కన్నడ మూవీతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత జూనియర్ సినిమాతో కన్నడ ఆడియెన్స్ ను పలకరిస్తోంది.
Swipe-worthy moments from yesterday’s #Junior Grand Pre Release Event in Bangalore ❤🔥
The presence of Karunada Chakravarthy @NimmaShivanna made the evening special ✨#Junior grand release on July 18th ✨
A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/ruvk5wDWpF
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 14, 2025
జూనియర్ సినిమాలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ‘మాయాబజార్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలకు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ ‘జూనియర్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.