
టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు మొన్నీమధ్య సామజవరాగమనా అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రీవిష్ణు తన కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. సామజవరాగమనా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీవిష్ణు నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓం భీమ్ భీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం కామెడీ ప్రధానంగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అందుతుందని అంటునాన్రు ప్రేక్షకులు.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హీరో శ్రీవిష్ణు. తాజాగా శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉస్మానియా యూనివర్సిటీలో ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్ చాలా కాలంగా తిష్టవేసి ఉంటారు. దాంతో అక్కడి విద్యార్థులు ప్లాన్ చేసి బయటకు పంపిస్తారు. ఆ ముగ్గురు భైరవపురం అనే ఊరికి వెళ్తారు.. అక్కడ ఏం జరిగింది.? ఆ ముగ్గురు ఏం చేశారు అన్నది మా సినిమా కథ. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తెలిపారు. అలాగే ఈ సినిమాలో నటించిన ఆయేషా ఖాన్ సడన్ గా మాకు చెప్పకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని వెళ్ళిపోయింది. దాంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది అని తెలిపాడు శ్రీవిష్ణు. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు చేస్తున్నాని అందులో ఒకటి స్వాగ్, మరొకటి థ్రిల్లర్ మూవీ అని తెలిపాడు శ్రీవిష్ణు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.