Sree Vishnu: మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్న వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు..

|

Feb 14, 2023 | 7:27 PM

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు.

Sree Vishnu: మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్న వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు..
Sree Vishnu
Follow us on

వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.

వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా.. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో కట్టివేస్తున్నట్లు ఫస్ట్ లుక్ నవ్వులు పూయించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సామజవరగమన పూర్తిగా ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావన కలిగిస్తుంది.

భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.