Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. నేరుగా హీరోగానే కాకుండా..

Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ రాజ చోర వచ్చేది అప్పుడే..
Raja Raja Chora Movie Review

Updated on: Aug 12, 2021 | 6:40 AM

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న శ్రీవిష్ణు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. నేరుగా హీరోగానే కాకుండా.. పలు క్యారెక్టర్స్ చేస్తూ.. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో రాజా రాజా చోర అనే డిఫరెంట్ కాన్సెప్ట్‏తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో బిగ్‏బాస్ ఫేమ్ గంగవ్వ కూడా కీలక పాత్రలో నటించినట్లుగా టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే విడుదలైన తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీలైనంత త్వరగా తన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ద్వారా ప్రేక్షకులను నవ్వించిన శ్రీవిష్ణు మరీ థియేటర్లలో ఎంతవరకు నవ్విస్తాడో చూడాల్సిందే.

ట్వీట్..

Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇంటిని ఎప్పుడైనా చూశారా.? అమ్మాయిలు ఆ రూమ్‌ చూస్తే కచ్చితంగా కుళ్లుకోవాల్సిందే.

Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

Allu Shirish: బుల్లితెరపైకి అల్లువారబ్బాయి.. మిల్కీబ్యూటీతో కలిసి సందడి చేయనున్న హీరో..