Deepika Padukone: గొంతెమ్మ కోర్కెలతో దీపికా ఈ పరిస్థితి తెచ్చుకున్నారా?

రెండు మెగా ప్రాజెక్ట్స్‌ నుంచి ఔట్‌. చిన్న విషయం కాదిది. ఫిమేల్‌ మెయిన్‌ రోల్‌ని మార్చేయాలని నిర్ణయించారంటే.. తనతో వేగలేం అనుకుని ఉండాలి. అంతకంటే మంచి ఆప్షన్‌ దొరికి ఉండాలి. రెండుదశాబ్దాలుగా బాలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌లా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ సడెన్‌గా సైడైపోడానికి రీజనేంటి? దీపిక ఎపిసోడ్‌పై ఇండస్ట్రీలో వస్తున్న రియాక్షనేంటి?

Deepika Padukone: గొంతెమ్మ కోర్కెలతో దీపికా ఈ పరిస్థితి తెచ్చుకున్నారా?
Deepika Padukone

Updated on: Sep 19, 2025 | 8:15 PM

కల్కి 2898 AD సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌మీదికొస్తుందో తెలీదు. కానీ ఈలోపే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పెద్ద బాంబు పేల్చింది. తమ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ దీపికా పదుకునే ఉండదని అధికారికంగా ప్రకటించింది. తనతో భాగస్వామ్యం కుదరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న నిర్మాణసంస్థ.. ప్రత్యామ్నాయం చూసుకుంటామని ప్రకటించింది. ఆ పాత్రకు ఎక్కువ కమిట్మెంట్‌ అవసరమంటూ.. వర్క్‌పై దీపికకు శ్రద్ధ లేదని ఇన్ డైరెక్టుగా చెప్పేశారు కల్కి మేకర్స్. దీనికంటే ముందు స్పిరిట్ సిన్మా కోసం దీపికా పదుకునేని తీసుకున్న సందీప్ రెడ్డి వంగా తర్వాత తనని సైడ్‌చేసి త్రిప్తి డిమ్రిని తీసుకోవడం టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ హాట్ టాపిక్ అయ్యింది. డేట్స్, టైమ్‌ విషయాల్లో కండిషన్స్‌తో పాటు తన టీమ్‌కి ఫైవ్‌స్టార్‌ ఫెసిలిటీకి డిమాండ్‌ చేయటంతోనే దీపికాను స్పిరిట్‌ ప్రాజెక్ట్‌నుంచి తప్పించినట్లు చెప్పుకున్నారు. దీపికా పదుకునేతో సందీప్‌రెడ్డికి కొన్ని విషయాల్లో విభేదాలు రావటంతో స్పిరిట్‌ సిన్మాకు ఆమె దూరమైందనేది ఓపెన్‌ సీక్రెట్‌. కల్కి సీక్వెల్‌ నుంచి ఎందుకు తప్పించారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి 2898 ADలో కృష్ణుడి ఎంట్రీ సీన్‌ని నాగ్‌ అశ్విన్‌ షేర్‌ చేశారు. అందులో కర్మ ఫలం గురించి కృష్ణుడు చెప్పే డైలాగ్‌ని షేర్‌ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టారు నాగ్‌అశ్విన్‌. జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అన్న కామెంట్‌ని.. దీపికను ఉద్దేశించేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండు మెగా ప్రాజెక్ట్‌నుంచి దీపికని తప్పించడం వెనుక...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి