
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేయగానే భారీ హైప్ నెలకొంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ చేయబోయే మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మొదటిసారి ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు .. అప్పుడే వార్తలలో నిలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి.. అటు నటీనటుల ఎంపిక.. లోకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ఇక సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటించనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా హీరోయిన్ విషయంలో నెలకొన్న వివాదం బయటకు వచ్చింది.
కథానాయికగా త్రిప్తిని ప్రకటించిన తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టంచింది. స్పిరిట్ మూవీ లీక్ చేయడంపై డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సీరియస్ అయ్యారు సందీప్ రెడ్డి. నీకన్నా చిన్న నటిని నువ్వు ఎదగకుండా చేయడానికి నా కథను బయటపెట్టావు.. నీ ఫెమినిజం ఇదే సూచిస్తుందా ? కథ మొత్తం లీక్ చేసిన నాకు ఫరఖ్ పడదు అంటూ ఘాటుగానే స్పందించారు. కథ వెనుక ఫిల్మ్ మేకర్స్ ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుందని..తనకు సినిమానే అంతా అని.. మొత్తం కథను లీక్ చేయండి.. ఏం భయపడను అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు దీపికాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో దీపికా మాట్లాడుతూ.. “నాకు ఒక దర్శకుడు సినిమా ఆఫర్ చేశారు. క్రియేటివ్ గా అది నాకు బాగా నచ్చింది. రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి నేను ఇంత ఛార్జ్ చేస్తాను అని చెప్పాను. అయితే మేము అంత భరించలేం.. ఎందుకంటే మేము హీరో మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని అన్నారు. నేను టాటా గుడ్ బై అని చెప్పేశాను.. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు.. నా విలువ నాకు తెలుసు.. నా సినిమాలు ఆడినంతగా ఆ హీరో సినిమాలు ఆడడం లేదని కూడా తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు దీపికా పై సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె చేసిన కామెంట్స్ ప్రభాస్ ను ఉద్దేశించేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే దీపికా వీడియో చూస్తుంటే గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూగా తెలుస్తోంది. అది లేటేస్ట్ వీడియో కాదని.. ఎప్పటిదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Thikka munda pic.twitter.com/OWVdViOUsG
— రాG🌸 రెడ్డి గారి అమ్మాయి❣️ (@RGNithya_pspk) May 29, 2025
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..