Soundarya: ఆ వ్యక్తి చెప్పడం వల్లే సినిమాల్లోకి సౌందర్య.. లేదంటే ఇండస్ట్రీ గొప్ప నటిని మిస్ అయ్యేది..
దశాబ్ద కాలంపాటు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోయిన్. అప్పట్లో ఆమె లేడీ సూపర్ స్టార్. అగ్రకథానాయకులతో సరిసమానంగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్. అమ్మోరు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మనవరాలి పెళ్లి, ప్రేమకు వేళాయేరా, హాలో బ్రదర్, టాప్ హీరో, పోస్ట్ మాన్, జయం మనదేరా, శ్రీ రాములయ్య, సీతయ్., తారకరాముడు, పవిత్ర బంధం, నిన్నే ప్రేమిస్తా, శ్రీ ముంజునాథ ఇలా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

దక్షిణాది సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోని అందమైన రూపం సౌందర్య. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆమెను అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చూడచక్కని రూపం.. ప్రశాంతమైన చిరునవ్వు.. కట్టిపడేసే అభినయంతో ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దశాబ్ద కాలంపాటు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోయిన్. అప్పట్లో ఆమె లేడీ సూపర్ స్టార్. అగ్రకథానాయకులతో సరిసమానంగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్. అమ్మోరు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మనవరాలి పెళ్లి, ప్రేమకు వేళాయేరా, హాలో బ్రదర్, టాప్ హీరో, పోస్ట్ మాన్, జయం మనదేరా, శ్రీ రాములయ్య, సీతయ్., తారకరాముడు, పవిత్ర బంధం, నిన్నే ప్రేమిస్తా, శ్రీ ముంజునాథ ఇలా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, శ్రీకాంత్, రజినీకాంత్ వరకు అన్ని భాషలలోని స్టార్ హీరోలందరి జోడిగా కనిపించింది. సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆమె హఠాన్మరణం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు. సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
సౌందర్య ఈ లోకాన్ని విడిచి దాదాపు 20 ఏళ్లు కావొస్తుంది.. కానీ ఇప్పటికీ ఆమెతో ఉన్న జ్ఞాపకాలను అటు సెలబ్రెటీలు, ఇటు అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సౌందర్యకు సంబందించిన ఓ రేర్ వీడియో వైరలవుతుంది. అందులో తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాలను బయటపెట్టింది. 10వ తరగతి ఎగ్జామ్స్ అయిన వెంటనే తన తండ్రి షూటింగ్కు వెళ్దామని చెప్పారని.. ఆ సమయంలో తాను సినిమాలు చేయనని ఏడ్చానని.. కానీ ఏం కాదని తన తండ్రి షూటింగ్ కోసం తీసుకెళ్లారని అన్నారు. ఆ తర్వాత సెట్లో జనాలు, లైట్స్ చూసి కంగారు పడ్డానని.. అప్పుడేం అర్థం కాలేదని.. డైరెక్టర్స్ చెప్పినట్లు చేసి వచ్చానని తెలిపారు. ఆ తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
