Sonu Sood: మానవత్వం పరిమళించిన మనస్తత్వం.. హ్యాపీ బర్త్ డే సోనూ భాయ్..

ఈ మధ్య కాలంలో దేశమంతా ఓ రియల్ హీరోగురిచే మాట్లాడుకుంతోంది. ఆయన సేవలను నిత్యం గుర్తుచేసుకొంటున్నారు ప్రజలు.

Sonu Sood: మానవత్వం పరిమళించిన మనస్తత్వం..  హ్యాపీ బర్త్ డే  సోనూ భాయ్..
Sonu Sood

Updated on: Jul 30, 2021 | 8:10 AM

Happy Birthday Sonu Sood: ఈమధ్య కాలంలో దేశమంతా ఓ రియల్ హీరోగురిచే మాట్లాడుకుంటోంది… ఆయన సేవలను నిత్యం గుర్తుచేసుకొంటున్నారు ప్రజలు… కష్టం అంటూ సాయం కోరితే కాదనకుండా..లేదనకుండా.. నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారు. ఆయనే సోనూసూద్. నేడు ఈ సూపర్ హీరో పుట్టిన రోజు. తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం.. సరికొత్తగా పరిచయం చేసుకుంది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం- అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఎంతోమంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూసూద్‌ను కదిలించారు. ఈ ఒక్క వ్యక్తి అడుగు ముందుకేసి, ఎంతోమందికి భరోసాగా మారాడు. కష్టమొచ్చిందని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి అండగా నిలిచాడు. కరోనా పాండమిక్ టైమ్‌లో రియల్ హీరోగా మారారు… రీల్ విలన్ సోనూసూద్‌. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు.

సోనూ సూద్ పై ప్రజలు అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటున్నారు. కొంతమంది ఆయన పేరును షాపులకు పెట్టుకుంటుంటే మరికొందరు ఏకంగా వారి పిల్లలకు సోనూ పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొంత మంది ఆయనకు గుడి కట్టి దైవంగా కొలస్తోన్నారు. ఇక ఆయనను అమితంగా ఇష్టపడే వారు నడుచుకుంటూ సోను ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆయనను కలుస్తున్నారు. అభిమానులు పిలవలే కానీ సోనూ కూడా ఎక్కడికైనా వెళ్తున్నారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి వారిని పలకరిస్తున్నారు. అంతే కాదు చిన్న చిన్న వ్యాపారాలను చేసుకునే వారిని ప్రోత్సహించాలని సోనూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజుకు సెలబ్రేట్ చేసుకున్నారు సోను. సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినిమా తారలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రాధేశ్యామ్’ వరకు.. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇవే.. ప్రేక్షకులకు పండగే..

Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమూరళీకి కరోనా పాజిటివ్‌.. వాయిదా పడ్డ సినిమా షూటింగ్‌లు