కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఆపదలో ఉన్నవారికి ఆసరాగా ఉండి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు నటుడు సోనూ సూద్. రియల్ అని పేరు తెచ్చుకున్నాడు. కొందరు అయితే దేవుడు అని సంభోదిస్తున్నారు. కాగా తాజాగా సోనూసూద్‌ను ఒడిశాలోని గంజామ్ జిల్లా కలెక్టర్ విమర్మించారు. మరికాసేపటికే ఆయన్ను ప్రశంశిస్తూ ట్వీట్ చేశారు. వివరాలు తెలుసుకుందాం పదండి. గంజాం జిల్లాకు చెందిన ఓ కరోనా బాధితురాలు తనకు చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయమని కోరుతూ సోనూసూద్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సోనూసూద్.. గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్‌ను ఏర్పాటు చేసినట్లు ఈనెల 15న ట్విట్టర్లో తెలిపారు.
We don’t received any communication from @SoodFoundation or @SonuSood . Requested patient is in Home isolation and stable. No bed issues @BrahmapurCorp is monitoring it. ?? @CMO_Odisha pic.twitter.com/oDeSrzpE3t
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021
“సోనూసూద్ కానీ, ఆయన సంస్థ కానీ మమ్మల్ని సంప్రదించలేదు. బాధితురాలు ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతోంది. పడకలకు ఎలాంటి కొరత లేదు. బరంపుర్ కార్పొరేషన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు”అని కలెక్టర్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Sir, We never claimed that we approached you, it’s the needy who approached us & we arranged the bed for him, attatched are the chats for your reference.Ur office is doing a great job & u can double check that we had helped him too.Have DM you his contact details. Jai hind , ?? https://t.co/9atQhI3r4b pic.twitter.com/YUam9AsjNQ
— sonu sood (@SonuSood) May 17, 2021
“మేము మిమ్మల్ని సంప్రదించినట్లు ఎక్కడా చెప్పలేదు. బాధితురాలు మమల్ని సంప్రదించినందుకు మేము తగిన ఏర్పాట్లు చేశాము. నేను అటాచ్ చేసిన ఛాట్స్ అందుకు సంబంధించిన ఆధారాలు. బాధితురాలికి సంబంధించిన కాన్టాక్ట్ వివరాలు మీకు మెసేజ్ చేశాను.” అని సోనూ రిప్లై ఇచ్చారు.
Our intention was not to criticise your system. We have our own TEAM GANJAM to ensure bed availability for patient which work 24*7. Still it’s our duty to investigate if any issues about bed availability. That’s why we cleared the facts. You and your Organization doing great job. https://t.co/nBvIvZR7lM
— Collector & District Magistrate, Ganjam (@Ganjam_Admin) May 17, 2021
‘మీరు చేస్తున్న పనిని విమర్శించాలి అనేది మా అభిమతం కాదు. బెడ్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మా టీమ్ 24 గంటలు కృషి చేస్తోంది. కానీ ఇంకా పడక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు చేయడం మా బాధ్యత. మీరు, మీ సంస్థ గొప్ప సేవ చేస్తున్నారు’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
Also Read: కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత వ్యాక్సిన్.. !
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపుతూ ఉత్తర్వులు