Varasudu: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. సెకండ్ సాంగ్ వచ్చేసింది.. పాడింది ఎవరో తెలుసా..

|

Dec 04, 2022 | 8:44 PM

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Varasudu: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. సెకండ్ సాంగ్ వచ్చేసింది.. పాడింది ఎవరో తెలుసా..
Thalapathy
Follow us on

దళపతి విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వరీసు… తెలుగులో ఈ సినిమాను వారసుడు గా తీసుకువస్తున్నారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా వారసుడు సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి అటు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా తో బరిలోకి దిగుతుంటే.. ఇటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో రానున్నారు. ఇలా ఇద్దరు బడా హీరోలు బరిలో ఉన్నా కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ వస్తుంది వారసుడు. ఈ సినిమా  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు. పోస్టర్లకు మంచి క్రేజ్ వచ్చింది.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అయిన ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ది దళపతి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట సినిమాలో దళపతి ఎంట్రీ సాంగ్ లా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటను స్టార్ హీరో శింబు ఆలపించగా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ పాట  విజయ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది.

సాంగ్ లో శింబు కూడా అదరగొట్టారు. తన డాన్స్ మూమెంట్స్ తో పాటకు ఫుల్ జోష్ తీసుకొచ్చారు శింబు. ‘వారసుడు’ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలివున్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో దళపతి ఏ రేంజ్ హిట్ అనుకుంటారో చూడాలి. ఈ సినిమాలో విజయ్ సరసం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..