Sonam Kapoor: రిలీజ్‌కు రెడీ అయిన బ్లైండ్.. రీ-ఎంట్రీలో సోనమ్ కోరిక తీరేనా..!

రీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సోనమ్‌ కోరిక తీరబోతోంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2023 | 11:31 AM

రీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సోనమ్‌ కోరిక తీరబోతోంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కూడా స్టార్ట్ కావటంతో రిజల్ట్ కోసం ఈగర్‌గా వెయిల్ చేస్తున్నారు ఈ స్టార్‌ కిడ్‌. 2019లో రిలీజ్ అయిన ది జోయా ఫ్యాక్టర్ సినిమా తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సోనమ్ కపూర్‌. పర్సనల్ లైఫ్‌కు టైమ్ ఇవ్వటం కోసం సినిమాలను పక్కన పెట్టేశారు. ఇప్పడు ఫ్యామిలీ లైఫ్‌ అంతా సెట్ అవ్వటంతో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. 2020లోనే ప్రారంభమైన రీమేక్ మూవీ బ్లైండ్‌ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోనమ్ చేస్తున్న ఈ మూవీని రెండేళ్ల క్రితమే తమిళ్‌లో రీమేక్ చేశారు. నయనతార లీడ్ రోల్‌లో నెట్రికన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలీవుడ్లోనూ బ్లైండ్ రీమేక్‌ ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు సోనమ్ కపూర్‌. బ్లైండ్‌ మూవీని థియెట్రికల్ రిలీజ్ కోసమే రెడీ చేసిన మేకర్స్ రిలీజ్‌ టైమ్‌కు ప్లాన్ మార్చేశారు. డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. ప్రజెంట్ నార్త్‌లో సక్సెస్‌ రేట్ అంతగా లేకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు మేకర్స్‌. డిజిటల్ రిలీజ్ విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చినా.. రిలీజ్ డేట్‌ లాక్ చేయడానికి కూడా చాలా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా జూలై 7న బ్లైండ్ డిజిటల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. టీజర్‌ రిలీజ్‌తో ప్రమోషన్‌ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్‌కు కూడా ఫ్రీగా అందుబాటులోకి వస్తుండటంతో వ్యూస్‌ పరంగా మంచి నెంబర్స్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్‌.

(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ