నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్.. ఆయన సినిమాకు క్రేజ్ గురించి అందరికి తెలుసు. యాక్షన్ చిత్రాలతోనే కాకుండా.. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రజలను అలరించారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య.. మరోవైపు ఆహా డిజిటల్ ప్లాట్ ఫాంలో హోస్ట్‌గా రాణిస్తున్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇక వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గోపీచంద్ మలినేని.
ఇక ఈ సినిమా తర్వాత నిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు అనిల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మధ్య గత రెండు రోజుల నుంచి సోనాక్షి సినిమా నుంచి తప్పుకుందని.. దానికి కారణం భారీగా రెమ్యూనరేషన్ అడగడమేనని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. టాలీవుడ్ సినిమాలో నేను యాక్ట్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అలాగే ఇప్పుడు ఆ సినిమా నుంచి నేను తప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అయినా.. ఇప్పటి వరకు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లో లేని హీరోయిన్‌ని ఎవరైనా సినిమా నుంచి తీసేస్తారా..? అవన్నీ రూమర్స్ అంటూ అంటూ సెటైర్లు వేసింది. చాలా కాలంగా సోనాక్షి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.