AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నవ్వు ఎంతో మందిని నవ్వించింది.. కానీ అతని జీవన పోరాటం ఎవ్వరికీ తెలియదు.!

సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా ఎన్నో మీమ్స్ చేస్తుంటాం. ఆఫీస్ టెన్షన్స్, ఇంట్లో సమస్యలు ఇలా రకరకాలా కారణాలతో సతమతం అవుతున్నా సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తే మాత్రం వాటిని పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకుంటాం. అయితే మనకు మీమ్స్ లో ఈ కుర్రాడు ఎక్కువగా కనిపిస్తుంటాడు.

ఆ నవ్వు ఎంతో మందిని నవ్వించింది.. కానీ అతని జీవన పోరాటం ఎవ్వరికీ తెలియదు.!
Viral Meme Laughing Boy Aru
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2026 | 5:27 PM

Share

మనందరం సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ చూస్తుంటాం.. నెట్టింట వచ్చే మిమ్స్ భలే నవ్వు తెప్పిస్తుంటాయి.. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయినా మీమ్ ఇది.. ఈ మీమ్ ను అందరూ చూసే ఉంటారు.. ఈ కుర్రాడి నవ్వు సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేసింది.. అతని నవ్వు ఎంతో మందిని నవ్వించింది.. ఆ ఒక్క నవ్వుతో రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యాడు ఆ పిల్లాడు.. అయితే ఆ నవ్వు వెనకాల ఓ జీవిత పోరాటం ఉంది. చిన్న వయసులోనే ఎన్నో ఆర్ధిక సమస్యలను ఎదుర్కున్నాడు ఈ కుర్రాడు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ తో సినిమాలో అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నాడు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

ఆ కుర్రాడి పేరు అరుణ్ కుమార్.. అతనిది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాదారం. చదువుకోవాల్లన్న ఆశ ఉన్నప్పటికీ ఆర్ధిక సమస్యల కారణంగా 3వ తరగతి వరకే చదివాడు. ఆతర్వాత చిన్న చిన్న పనులకు వెళ్లడం మొదలు పెట్టాడు. అలా చిన్నావయసులోనే జీవన పోరాటం మొదలు పెట్టాడు అరుణ్.. ఈ క్రమంలోనే తన బావ నెహ్రు దగ్గర లారికి క్లినర్ గా చేరాడు. రోజు తన బావతో కలిసి లారీకి వెళ్తున్నాడు.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

ఒక రోజు తన బావ నెహ్రు సరదాగా వేసిన ఓ జోక్ కు అరుణ్ తనివితీరా నవ్వాడు.. ఆ నవ్వు నేటిజన్స్ ను ఆకట్టుకుంది.. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే.. ఎప్పుడు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిన మనోడే కనిపిస్తున్నాడు.. అయితే అరుణ్ ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలిమ్ లో నటిస్తూ ఇండస్ట్రీలోకి రావాలని చూస్తున్నాడు.. అలాగే చదవాలన్నా తన ఆశాను కూడా వదలకుండా ఓపెన్ లో 10తరగతి పూర్తి చేశాడు. మరి ఈ వైరల్ కుర్రాడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us