Golden Sparrow Song: అదిరిపోయిందిగా.. సెన్సేషనల్ గోల్డెన్ స్పారో సాంగ్.. ఇప్పుడు తెలుగులో విన్నారా.. ?

సోషల్ మీడియాలో చాలా సాంగ్స్ సెన్సేషన్ అయ్యాయి. అందులో గోల్డెన్ స్పారో ఒకటి. ఈ పాట ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సాంగ్ తెలుగులోకి వచ్చేసింది. తాజాగా యూట్యూబ్ లో విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ తెలుగు వెర్షన్ విన్నారా.. ? ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

Golden Sparrow Song: అదిరిపోయిందిగా.. సెన్సేషనల్ గోల్డెన్ స్పారో సాంగ్.. ఇప్పుడు తెలుగులో విన్నారా.. ?
Golden Sparrow

Updated on: Jan 30, 2025 | 7:19 PM

గోల్డెన్ స్పారో.. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద ఈ పాటకు స్టెప్పులు అదరగొట్టారు. గతేడాది కోలీవుడ్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం సినిమాలోనిది ఈ పాట. విడుదలైన వెంటనే ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యట్యూబ్ లో దాదాపు 14 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెట్టింట ఈ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఇక ఈ పాట ఇప్పుడు తెలుగులో విడుదలైంది. ఇన్నాళ్లు తమిళంలో అలరించిన ఈ పాట ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రాంబాబు గోసాల సాహిత్యం అందించగా.. సుభ్లాషిణి, అరివు తదితరులు ఆలపించారు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూర్చారు.

ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలలో నటించగా.. హీరో ధనుష్ దర్శకత్వం వహించారు. ఈ స్పెషల్ పాటలో హీరోయిన్ ప్రియాంక మోహనన్ నటించారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ గోల్డెన్ స్పారో. గతేడాది ఆగస్టులో తమిళంలో విడుదలైన ఈ సాంగ్ సంచలన విజయం అందుకుంది. ఈ పాటకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ధనుష్ కుభేర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో అక్కినేని నాగార్జున సైతం కీలకపాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత ధనుష్ మరోసారి డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు టాక్.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..