సినిమాల్లోకి మరో సోషల్ మీడియా బ్యూటీ..! స్టార్ హీరోయిన్స్‌ను మించిన అందం గురూ..

టాలీవుడ్ లో కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొత్త కొత్త భామలు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇతర భాషల అమ్మాయిలే కాదు తెలుగు ముద్దుగుమ్మలు కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. సోషల్ మీడియా నుంచి చాలా మంది భామలు ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా అడుగుపెడుతున్నారు.

సినిమాల్లోకి మరో సోషల్ మీడియా బ్యూటీ..! స్టార్ హీరోయిన్స్‌ను మించిన అందం గురూ..
Actress

Updated on: Dec 23, 2025 | 10:49 AM

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అందాల భామలు పరిచయం అయ్యి తమ నటనతో అందంతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా వాడకం మరింత ఎక్కువైంది. టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ అంటూ జనాలంతా సోషల్ మీడియాతో బిజీగా మారిపోయారు. కాగా సోషల్ మీడియా వల్ల కొంతమంది తమలో టాలెంట్ ను బయట పెట్టి క్రేజ్ తెచ్చుకున్నారు. రకరకాల రీల్స్ చేసి పాపులర్ కూడా అయ్యారు. అలాగే హీరోయిన్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఇక కొంతమంది ఇన్ స్టా బ్యూటీస్ ఇప్పుడు హీరోయిన్స్ గా మారిపోయారు.

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

అలా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వైష్ణవి చైతన్య, సాక్షి వైద్య, ఇమాన్వి, ఐశ్వర్య శర్మ, రమ్య పసుపులేటి ఇలా చాలా మంది ఉన్నారు. బేబీ సినిమాతో వైష్ణవి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు మరో సోషల్ మీడియా బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ఎవరో కాదు ప్రీతీ పగడాల. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా పాపులర్. రకరకాల రీల్స్ చేసి పాపులర్ అయ్యింది. ముఖ్యంగా గుడ్డు మోటివేషన్ అంటూ రకరకాల రీల్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

అలాగే డ్రసింగ్ గురించి చెప్తు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం పతంగ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సింగర్ ప్రణవ్ కౌశిక్ నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి మరో తెలుగమ్మాయి సినిమాల్లోకి వస్తుంది. మరి ఈ చిన్నది ఎలా రాణిస్తుందో చూడాలి.

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.