Sitara Ghattamaneni: ‘సినిమా నా డీఎన్ఏలోనే ఉంది ‘.. తాతయ్య, తండ్రి గురించి సితార ఎమోషనల్ పోస్ట్..

తన పుట్టినరోజు సందర్భంగా కొందరు విద్యార్థినీలకు సైకిల్స్ బహుమతిగా అందించింది. అంతకు ముందు తాను మొదట చేసిన యాడ్ రెమ్యూనరేషన్ మహేష్ ఫౌండేషన్ కు అందించింది. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పెద్దవారితో సితార ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు అందుకుంది. తాజాగా తన తండ్రి, తాతయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ తన ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈరోజు (అక్టోబర్ 13న) నేషనల్ సినిమా డే కావడంతో తన కుటుంబ సినిమా జీవితం గురించి చెప్పుకొచ్చింది.

Sitara Ghattamaneni: సినిమా నా డీఎన్ఏలోనే ఉంది .. తాతయ్య, తండ్రి గురించి సితార ఎమోషనల్ పోస్ట్..
Sitara Ghattamaneni

Updated on: Oct 13, 2023 | 6:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని నెట్టింట ఎంత యాక్టివ్‏గా ఉంటుందో చెప్పక్కర్లేదు. రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే ఇంట్లో ఫెస్టివల్స్ జరిగినా.. ఫంక్షన్స్ ఇలా అన్నింటికి సంబంధించిన అప్డేట్స్ ఫాలోవర్లతో పంచుకుంటుంది. ఇక సితార మంచి మనసు గురించి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా కొందరు విద్యార్థినీలకు సైకిల్స్ బహుమతిగా అందించింది. అంతకు ముందు తాను మొదట చేసిన యాడ్ రెమ్యూనరేషన్ మహేష్ ఫౌండేషన్ కు అందించింది. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పెద్దవారితో సితార ప్రవర్తించిన తీరుపై ప్రశంసలు అందుకుంది. తాజాగా తన తండ్రి, తాతయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ తన ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈరోజు (అక్టోబర్ 13న) నేషనల్ సినిమా డే కావడంతో తన కుటుంబ సినిమా జీవితం గురించి చెప్పుకొచ్చింది.

“సినిమా.. నా జీవితంలోనే ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాకు అది కేవలం ఇండస్ట్రీ కాదు. సినిమా అనేది నా డీఎన్ఏలోనే ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నా తండ్రి ఒక సూపర్ స్టార్. ఆయన నాకు స్పూర్తిదాయకం. అలాగే మా నాన్నకు మా తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ అదే విధంగా స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ప్రయాణం మా జీవితాలకు ఎంతో ప్రభావితం అయ్యింది. ఇలాంటి వారసత్వంలో నేను భాగం అయినందుకు ఎంతో గౌరవంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది సితార. అలాగే తమ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం సీతార పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సితార త్వరలోనే సినీరంగంలోకి అడుగుపెట్టాలుకుంటుంది. ఒకప్పుడు తన తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసిన సీతూపాప ఇప్పుడు ఒంటరిగా యాడ్స్ చేస్తుంది. ఇటీవల ఓ ప్రముఖ జువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కమర్షియల్ యాడ్ చేసింది. అలాగే తనకు నటనపై ఆసక్తి ఉందని తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.