Sitara Ghattamaneni: ‘దమ్ మసాలా’ పాటకు డాన్స్ ఇరగదీసిన సితార.. లుంగీ కట్టి అదరగొట్టేసింది..
అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ముఖ్యంగా మహేష్ పాటలకు సితార డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇప్పటికే సీతూపాప షేర్ చేసిన డాన్స్ వీడియోస్ మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. తాజాగా సూపర్ హిట్ గుంటూరు కారం మూవీలోని దమ్ మసాలా పాటకు డాన్స్ ఇరగదీసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా.. తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో తెల్ల షర్ట్, ఎర్ర లుంగీ కట్టి దమ్ మసాలా పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇంకా సినీ అరంగేట్రం చేయకుండానే తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎప్పుడూ చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తన తండ్రిలాగే పేద విద్యార్థలుకు సాయం చేస్తుంది. అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ముఖ్యంగా మహేష్ పాటలకు సితార డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇప్పటికే సీతూపాప షేర్ చేసిన డాన్స్ వీడియోస్ మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. తాజాగా సూపర్ హిట్ గుంటూరు కారం మూవీలోని దమ్ మసాలా పాటకు డాన్స్ ఇరగదీసింది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేయగా.. తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో తెల్ల షర్ట్, ఎర్ర లుంగీ కట్టి దమ్ మసాలా పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది.
సితారకు ఇన్ స్టాలో దాదాపు రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీతూపాప షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. సీతూపాప డాన్స్ వీడియో చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోకు ఇప్పటివరకు 50 లక్షల వ్యూస్ రావడం విశేషం. భవిష్యత్తులో సితార సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని ఇప్పటికే నమ్రత పలుమార్లు చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార మాట్లాడుతూ.. తనకు నటనపై ఆసక్తి ఉందనే విషయం చెప్పేసింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సితార క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు సినిమాల్లోకి పలు పాటలకు డాన్స్ చేయడం.. పండగలకు క్లాసికల్ డాన్స్ చేస్తూ కనిపిస్తుంటుంది.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు జోడిగా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరీ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, ఈశ్వరీ రావు కీలకపాత్రలు పోషించగా.. థమన్ సంగీతం అందించారు. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. మాస్ కమర్షియల్ డ్రామాగాను గురూజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి పండక్కి జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.
View this post on Instagram
Like father😎 Like daughter🥰 pic.twitter.com/Y8IEMT22qq
— Hank (@Hanky_bb) February 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




