AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HanuMan: చరిత్ర లిఖించిన ‘హనుమాన్‌’.. టాలీవుడ్ హిస్టరీలోనే అరుదైన ఫీట్

మూడు వారాల్లోనే సుమారు రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువైన హనుమాన్ సినిమా.. అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో తెలుగు, హిందీల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది ‘హనుమాన్‌’.

HanuMan: చరిత్ర లిఖించిన ‘హనుమాన్‌’.. టాలీవుడ్ హిస్టరీలోనే అరుదైన ఫీట్
Hanuman
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2024 | 12:11 PM

Share

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పలువురు సెలబ్రిటీలు, పొలిటిషన్స్ సైతం ఈ  చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తీసిన ఈ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. పొంగల్ సీజన్‌లో రిలీజైన చిత్రాల జాబితా’లో.. టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాప్ 1గా నిలిచింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది మూవీ టీమ్. ‘‘వరల్డ్ వైడ్ ఉన్న ప్రేక్షకుల ప్రేమతో ‘హనుమాన్‌’ హిస్టరీ క్రియేట్ చేసింది. 92 ఏళ్ల టాలీవుడ్‌ ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది’’ అని రాసుకొచ్చింది.

జనవరి 12న రిలీజైన ఈ సినిమా రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ కొట్టే పనిలో ఉంది. మరో రెండు రోజుల్లో ఈ ఫీట్ కూడా అచీవ్ చేసేలా ఉంది.  ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రాబోతున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్టయింది . ఈ సినిమాలోని మెయిన్ లీడ్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ‘‘ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండాలి. చూడగానే భక్తి భావం కలగాలి. ఆ లిస్ట్‌లో చిరంజీవి గారు కూడా ఉండొచ్చు’’ అని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల వ్యాఖ్యానించాడు. రాముడిగా తన మనసులో ఉన్న నటుడు మహేశ్‌బాబు అని ప్రశాంత్ చెబుతున్నాడు. రాముడిగా క్రియేట్‌ చేసిన ఫొటోలను చూశానని.. అవి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నాడు. పార్ట్‌ 1లో నటించిన తేజ కూడా పార్ట్‌ 2లో కనిపించనున్నాడు. ‘హనుమాన్‌’ సినిమా కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.