Sir Movie: గవర్నమెంట్‌ స్కూల్‌ పిల్లలకు ఫ్రీగా ధనుష్‌ ‘సార్‌’ సినిమా.. పీవీఆర్‌ మల్టిప్లెక్స్‌తో కలిసి..

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సార్ సినిమాకు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం.

Sir Movie: గవర్నమెంట్‌ స్కూల్‌ పిల్లలకు ఫ్రీగా ధనుష్‌ సార్‌ సినిమా.. పీవీఆర్‌ మల్టిప్లెక్స్‌తో కలిసి..
Sir Movie

Updated on: Feb 25, 2023 | 6:50 AM

స్టార్‌ హీరో ధనుష్, సంయుక్త మేనన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సార్‌’. ‘చదువుకుందాం.. చదువు’కొన’కూడదు’ అంటూ విద్యకు ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి. అలాగే కార్పొరేట్‌ విద్యా సంస్థల అక్రమాలపై కూడా గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్‌ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సార్ సినిమాకు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అటు తమిళ్‌లో వాతి పేరుతో విడుదలైన ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. కాగా విద్యకు ఉన్న వ్యాల్యూ గురించి చర్చిస్తూనే మంచి మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు చోటివ్వడంతో సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. చదువుకునే వాళ్లు, చదువు చెప్పేవాళ్లు అందరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలని కామెంట్లు వస్తున్నాయి. ఈక్రమంలో ‘సార్’ సినిమా యూనిట్, ప్రముఖ మల్టిప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌తో కలిసి ఓ మంచిపని చేసింది. సినిమా మరికొందరికి రీచ్‌ అయ్యేలా హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు ధనుష్ సార్ సినిమాని పీవీఆర్‌ థియేటర్స్‌లో ఉచితంగా చూపించారు

అంతే కాకుండా విద్యార్థులకు ఫ్రీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బెలూన్స్ కూడా అందించారు చిత్రయూనిట్. అలాగే సినిమా పూర్తయిన తర్వాత ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి సినిమా ఎలా ఉంది? అంటూ ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ‘సార్’ సినిమా చాలా బాగుందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈక్రమంలో గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు వచ్చి సినిమా చూడటం, హాల్ లో సందడి చేయడం వంటి దృశ్యాలను చిత్రీకరించి పీవీఆర్‌ సంస్థ, చిత్రయూనిట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సార్‌ చిత్ర ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..