Tollywood: బస్ ఛార్జీకి డబ్బుల్లేవని.. ఎంసెట్ హాల్ టికెట్ చూపించి సినిమాకెళ్లిన టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?

చిన్నప్పుడు సినిమాలు చూసేందుకు చాలా మంది స్కూల్స్, కాలేజీలు బంక్ కొడుతుంటారు. అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం చాలా డిఫరెంట్. బస్ ఛార్జీకి డబ్బుల్లేవని ఏకంగా కండక్టర్ కు తన హాల్ టికెట్ ను చూపించి మరీ సినిమా కెళ్లాడు.

Tollywood: బస్ ఛార్జీకి డబ్బుల్లేవని.. ఎంసెట్ హాల్ టికెట్ చూపించి సినిమాకెళ్లిన టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: May 12, 2025 | 1:50 PM

మనం చిన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసి ఉంటాం. అందుకు గానూ తల్లిదండ్రుల చేతుల్లో దెబ్బలు తిని కూడా ఉంటాం. ఈ టాలీవుడ్ హీరో కూడా మన బ్యాచే. చదువు పెద్దగా అబ్బలేదు. ఇంట‌ర్మీడియ‌ట్ చదువుతున్న రోజుల్లో కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఈ హీరోకు సినిమాలంటే ఎంత పిచ్చి అంటే.. ఎంసెట్ ఎగ్జామ్ ముందు రోజు కూడా సినిమాకు వెళ్లాడట. బస్ ఛార్జీకి డబ్బుల్లేకపోవడంతో ఎంసెట్ హాల్ టికెట్ తీసుకుని బస్ ఎక్కాడట. హాల్ టికెట్ చూపిస్తే కండక్టర్ టికెట్ కొట్టడని ఒక స్నేహితుడు చెప్పడంతో అలా చేశాడట. కానీ బస్సులో అలా ఏమీ జరగలేదట. చివరకు మన హీరో కండక్టర్ చేతిలో భంగపడ్డాడట. కాగా చదువు అబ్బకపోవడంతో క్రికెట్ లో సత్తా చూపించాడీ యాక్టర్. ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్-19 క్రికెట్ లో కూడా ఆడాడు. కానీ ఆ పై స్థాయికి వెళ్లలేకపోయాడు. చివరకు సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరో ఫ్రెండ్ గా చిన్న చిన్న రోల్స్ పోషించాడు. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మినిమిమ్ గ్యారెంటీ హీరోల్లో ఇతను కూడా ఒకడు. ఇటీవలే మరో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ హీరో మరెవరో కాదు శ్రీ విష్ణు.

సింగిల సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో భాగంగానే ఎంసెట్ హాల్ టికెట్ తో సినిమాక వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు ఆడియెన్స్ రెస్పాన్స్..

గోకుల్ థియేటరల్ సింగిల్ సినిమా యూనిట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.