
టాలీవుడ్ లో అందాల సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీత. తన గాత్రంతో ఇన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు ఈ గాయని. పాటలతోనే కాను రూపం లోనూ సునీత ఎంతో ముచ్చటగా ఉంటారు. ఆమె మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. ఆ అందమైన గాత్రంతోనే ఎంతోమంది హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పారు సునీత. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా, యాంకర్ గా ఇలా అన్నింటిలోనూ ప్రతిభ చాటుకున్నారు సునీత. వయసు పెరుగుతున్న తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు సునీత. హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం. ఇటీవలే సునీత కొడుకు హీరోగా పరిచయమయ్యాడు. సర్కారు నౌకరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీత కొడుకు ఆకాష్. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. తాజాగా సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం సునీత పలు లైవ్ కాన్సెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. నన్ను అభిమానిస్తున్న నా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడానికి గంట ప్రయాణం పట్టింది. ఈ రోజు వర్కింగ్ డే అయినా కూడా వచ్చాను. ఎందుకంటే మ్యూజిక్ అంటే అంత ఇష్టం నాకు. మ్యూజిక్ ని ఇష్టపడే వారు ఉంటే చాలు.. ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ఏరియా అయినా పర్వాలేదు వచ్చేస్తాను అంటూ సునీత చెప్పుకొచ్చారు.
అలాగే మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎవరైనా ప్లాన్ చేస్తే ఎప్పుడైనా, ఎక్కడికైనా వచ్చేస్తా. ప్లేస్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు అని అన్నారు సునీత. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ రేంజ్ లో డైలాగ్ చెప్పారు అంటూ నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.