Vijay- Trisha: విజయ్ ఇష్టమే కానీ త్రిష అస్సలు నచ్చదు.. స్టార్ సింగర్ షాకింగ్ కామెంట్స్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా హీరో విజయ్ పాలనా పగ్గాలు స్వీకరించారు. ఆదివారం (మే 10) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరుక్షణమే తానిచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అయితే విజయ్‌తో పాటు హీరోయిన్ త్రిష పేరు కూడా కాస్త గట్టిగానే వినిపించింది.

దళపతి విజయ్.. మొన్నటివరకు హీరోగా రాణించిన ఈ స్టార్.. ప్రస్తుతం తమిళనాడు సీఎం. సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉండగానే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడమే కాదు.. తన స్పీచ్ లతో అందరిని ఆకట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతునే తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో కూడా చెప్పి విజయ్ జనల హృదయాలను గెలుచుకున్నారు. ఫలితంగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో జనాలు విజయ్ కు భారీగా ఓట్లు వేశారు. ఇక ఇప్పుడు సీఎం గా పదవీబాధ్యతలు చేపట్టారు విజయ్. అయితే విజయ్ పేరు ఎంత మారుమ్రోగిందో దేశం మొత్తం త్రిష పేరు కూడా అదే రేంజ్ లో వినిపించింది. ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకులు కోరడం.. ఓ నటితో విజయ్ కు ఎఫైర్ ఉందని ఆరోపిస్తూ ఆధారాలు కూడా చూపిస్తూ విజయ్ భార్య విడాకులకు కోర్టును ఆశ్రయించింది. దాంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా దుమారం రేగింది. అదే సమయంలో త్రిష పేరు బయటకు వచ్చింది.
ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
రీసెంట్ గా విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ సందడి చేశారు త్రిష. దాంతో అందరూ విజయ్ , త్రిష గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ సీఎంగా పదవీబాధ్యతలు చెప్పటగా.. త్రిష సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సింగర్ త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సింగర్ ఎవరో కాదు ఎన్నో సాంగ్స్ ఆలపించడమతొ పాటు వివాదాలతో వార్తల్లో నిలిచిన సుచిత్ర.
ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను
ఇటీవల ఓ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తనకు విజయ్ అంటే ఇష్టమే కానీ, త్రిష అంటే అస్సలు ఇష్టం లేదని సుచిత్ర తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. నేను పక్షపాతం లేకుండా నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతాను. సక్సెస్ అయిన వ్యక్తులు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు వారి జీవితాల్లోకి పరాయి వ్యక్తులు వస్తుంటారు. విజయ్ తన తల్లిదండ్రులకు, భార్యకు దూరమై తనను తాను ఒంటరి చేసుకున్నాడు. అతను ఒంటరివాడే కానీ ఇప్పటివరకు ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే అతను రాజకీయాల్లోకి వచ్చాడు; నిజం చెప్పాలంటే, అతనికి తన తండ్రి చంద్రశేఖర్ అవసరం ఉంది. ఆయనే విజయ్‌ను రాజకీయాల్లో నడిపించగలరు, లేకపోతే అతను రాజకీయాల్లో ఏమీ సాధించలేడు. ఎందుకంటే రాజకీయాల్లో అతనికి ఏవైనా మంచి జరగాలంటే, దానికి అతని తండ్రి మద్దతే కారణం,” అని చెప్పుకొచ్చింది సుచిత్ర.
ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

Singer Suchitra




