
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సింగర్ ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని మృతి చెందారు. మురళికృష్ణ మృతిపై సినీప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మురళీకృష్ణ మృతిైప సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ బాధకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని.. తాను ఎంతో ప్రియమైన సోదరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
“ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని నేను షాకయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాము. ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక.. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ రాసుకొచ్చారు సింగర్ చిత్ర.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..
సింగర్ జానకి తనయుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగినవారు. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మురళీకృష్ణ మృతితో ఎస్. జానకి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక సింగర్ జానకి సినీప్రస్థానం విషయానికి వస్తే.. ఇప్పటివరకు దాదాపు 50 వేలకుపైగా పాటలు పాడారు. సినీరంగంలో దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..