
రాహుల్ సింప్లిగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియనివారుండరు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోస్ నుంచి మొదలైన రాహుల్ ప్రయాణం ప్రపంచప్రఖ్యత ఆస్కార్ వేదిక వరకు చేరింది. తన గాత్రంతో యావత్ దేశ ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని మైమరపించాడు. ఎప్పుడూ తన పాటలతో అలరించే రాహుల్.. ఇప్పుడు నటుడిగానూ మెప్పించాడు. ఇటీవల విడుదలైన రంగమార్తండ సినిమాలో రాహుల్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
రాహుల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీప్రముఖులు.. రాజకీయ నాయకులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాహుల్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.