Singer Mangli : సింగర్ నుంచి హీరోయిన్‌గా మారనున్న మంగ్లీ.. హీరో ఎవరంటే

|

Jan 18, 2023 | 3:52 PM

కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది. చిత్తూరు జిల్లా సుంకిడికి చెందిన మంగ్లీ అసలు పేరు..

Singer Mangli : సింగర్ నుంచి హీరోయిన్‌గా మారనున్న మంగ్లీ.. హీరో ఎవరంటే
Mangli
Follow us on

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ సింగర్స్ లో మంగ్లీ పేరు కూడా ఉంటుంది. తనదైన గాత్రంతో అద్భుతంగా పాటలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మంగ్లీ. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది. చిత్తూరు జిల్లా సుంకిడికి చెందిన మంగ్లీ అసలు పేరు.. సత్యవతి రాథోడ్. అయితే తెలంగాణలో మంగ్లీగా మారి తెలంగాణ యాసలో ఫోక్ సాంగ్స్  పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది మంగ్లీ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమా చేయనుంది ఈ భామ.

మంగ్లీ హీరోయిన్ గా త్వరలోనే ఓ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే మంగ్లీ హీరోయిన్ గా సినిమా తెరకెక్కేది ఇక్కడ కాదట.. కన్నడ భాషలో అని తెలుస్తోంది. కన్నడ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్వకత్వం వహిస్తున్న `పాదరాయ`ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో మంగ్లీ పాన్ ఇండియా హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2013-14 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా  ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాగశేఖర్ హీరోగా నటిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.