AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Harika Narayan: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సింగర్.. ప్రియుడిని పరిచయం చేసిన హారిక..

ప్రస్తుతం టాప్ మోస్ట్ సింగర్‏గా దూసుకుపోతున్న ఆమె తన ప్రియుడితో ఏడుగులు వేయబోతున్నారు. ఇటీవలే తన నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని హారిక తన ఇన్ స్టా ద్వారా తెలుపుతూ తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేశారు. హారికకు కాబోయే భర్త పేరు పృథ్వీనాథ్ వెంపటి. వీరిద్దరు గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. "ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం" అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది హారికా.

Singer Harika Narayan: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ సింగర్.. ప్రియుడిని పరిచయం చేసిన హారిక..
Harika Narayan
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2024 | 3:28 PM

Share

తెలుగు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ ఆలపించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సింగర్ హారికా నారాయణ్. వారసుడు సినిమాలోని ‘తలపతి’పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు. విభిన్న వాయిస్‏తో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్‏ను అలరించారు. హారికాకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం టాప్ మోస్ట్ సింగర్‏గా దూసుకుపోతున్న ఆమె తన ప్రియుడితో ఏడుగులు వేయబోతున్నారు. ఇటీవలే తన నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ విషయాన్ని హారిక తన ఇన్ స్టా ద్వారా తెలుపుతూ తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేశారు. హారికకు కాబోయే భర్త పేరు పృథ్వీనాథ్ వెంపటి. వీరిద్దరు గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. “ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం” అంటూ నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది హారికా. దీంతో వీరికి సినీ ప్రముఖులు, సన్నిహేతులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. దీంతో

హారికా నారాయణ్.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన హారికా.. ఇప్పుడు గాయనిగా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత విధ్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి హారిక దగ్గరి బంధువు కావడం విశేషం. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె.. సూర్యాకాంతం సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతం సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడారు.

బ్లాక్ రోజ్ సినిమాలోని నా తప్పు ఏమున్నదబ్బా పాటతో యూత్ కు కనెక్ట్ అయ్యారు… ఆ తర్వాత విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో తలపతి పాటతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చేసింది. హారికకు కాబోయే భర్త పృథ్వీనాథ్ ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి చదువుకునేటప్పటి నుంచే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ప్రియుడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు హారిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?