Pragathi- Singer Chinmayi: నటి ప్రగతిపై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి.. మరీ అలా అనేసిందేంటి

టాలీవుడ్ సీనియర్ నటి పవర్ లిఫ్టింగ్ లో పతకాల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రగతి నాలుగు పతకాలు గెల్చుకుంది. ఒక బంగారు పతకంతో పాటు మూడు రజిత పథకాలను ఖాతాలో వేసుకుంది.

Pragathi- Singer Chinmayi: నటి ప్రగతిపై ట్రోల్స్.. ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి.. మరీ అలా అనేసిందేంటి
Pragathi, Singer Chinmayi

Updated on: Dec 10, 2025 | 8:18 PM

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లకు అత్తగా, అమ్మగా, అక్కగా, వదినగా.. ఇలా అన్ని రకాల సహాయక నటి పాత్రలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైందీ అందాల తార. అయితే గత కొంత కాలంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది ప్రగతి. దీనికి బదులు పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాల వర్షం కురిపిస్తూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొన్న ప్రగతి ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకుంది. ఇందులో ఒక బంగారు పతకంతో పాటు మూడు రజత పతకాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రగతి పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోన్న ప్రగతి గతంలో పలు విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జిమ్ ఫొటోలను షేర్ చేసినప్పుడు కొందరు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. నెగెటివిటీ కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. అయినా ప్రగతి ఈ విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. దీనికి సింగర్ చిన్మయి స్పందించింది. ట్విట్టర్ ద్వారా ప్రగతి గురించి చెబుతూ ఒక పోస్ట్ పెట్టింది..

ఇవి కూడా చదవండి

‘ప్రగతి గారి ఫొటోల గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టినవారు వాళ్ల జీవితంలో ఏం సాధించారు? అలాంటివారు ఎప్పటికీ ఏమి సాధించలేరు. అలాగే అమ్మాయిలు.. మీరు కూడా ప్రగతి గారి నుంచి స్ఫూర్తి పొంది ముందుకు వెళ్లండి. మీపై వచ్చే చెడు కామెంట్లను తీసి పక్కన పడేయండి అలాగే మీరు భవిష్యత్తులో ఇలాంటి వారి కుటుంబంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.

సింగర్ చిన్మయి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..