
తెలుగు సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వారిలో మహేంద్రన్ ఒకరు. తెలుగులో సింహరాశి, దేవి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. చిన్న వయసులోనే బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ నీలకంఠ. ఈ సినిమా జనవరి 2న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
“పవర్ కష్టాలు.. విజయాలను నీలకంఠలో చూడండి. ఫిబ్రవరి 6 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి” అంటూ రాసుకొచ్చింది. వాళ్లు శిక్షించిన మనిషి.. వాళ్ల లీడర్ గా ఎదిగాడు అనే కామెంట్ ఉన్న పోస్టర్ షేర్ చేశారు. నీలకంఠ ఓ రూరల్ డ్రామా.. ఓ సాధారణ టేలర్ గా ఉన్న యువకుడు గొప్ప చదువులు చదవాలని కలలు కంటాడు. కానీ చిన్నతనంలో చేసిన తప్పు వల్ల కొన్నాళ్లపాటు ఊరు విడిచి ఎక్కడికి వెళ్లకుండా పై చదువులు చదవకుండా శిక్ష ఎదుర్కొంటాడు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
ఆ తర్వాత అతడు కబడ్డీ ఆడాలని నిర్ణయించుకుంటాడు. అతడి జీవితాన్ని ఎలా మార్చింది ? అతడు చేసిన తప్పేంటీ ? అనేది నీలకంఠ సినిమా. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన మహేంద్రన్ హీరోగా ఎలా మెప్పించాడు అనేది నీలకంఠలో చూడొచ్చు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
Witness the power, the struggle, and the triumph in Nilakanta.
Streaming from 6th Feb on Sun NXT – Watch Now!
[Nilakanta Tamil movie, Nilakanta Telugu movie, action drama, heroic journey, latest Tamil OTT release, Sun NXT streaming, powerful leader story]#Nilakanta #SunNXT… pic.twitter.com/Q5kkgtc3X9
— SUN NXT (@sunnxt) January 30, 2026
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..