కమల్ హిట్ ‌చిత్రానికి శింబు సీక్వెల్‌ !

|

Sep 13, 2020 | 3:24 PM

నటుడు శింబుకు తమిళనాట మంచి క్రేజ్ ఉంది. తెలుగు జనాలకు కూడా ఇతగాడు సుపరిచితుడే. అయితే కొన్నేళ్లుగా ఆయన రెగ్యూలర్ గా సినిమాలు చేయడం లేదు.

కమల్ హిట్ ‌చిత్రానికి శింబు సీక్వెల్‌ !
Follow us on

నటుడు శింబుకు తమిళనాట మంచి క్రేజ్ ఉంది. తెలుగు జనాలకు కూడా ఇతగాడు సుపరిచితుడే. అయితే కొన్నేళ్లుగా ఆయన రెగ్యూలర్ గా సినిమాలు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్  అసంతృప్తిలో ఉన్నారు. తాజాగా వారిని ఉత్సాహపరిచేందకు శింబు జోరు‌ పెంచారు. 70ల్లో కమల్‌ నటించిన సూపర్ హిట్‌ మూవీ ‘సిగాప్పు రోజాక్కల్‌’కు సీక్వెల్‌ తీసే ప్రయత్నాల్లో ఉన్నారని ఇండస్ట్రీ టాక్‌. అందులో లవ్ ఫెయిల్యూర్ అయ్యి, మానసిక సమస్యలతో సైకోగా మారి అమ్మాయిలను చంపే పాత్రలో కమల్‌ కనిపించారు. 1978లో వచ్చిన ఈ చిత్రానికి భారతీరాజా డైరెక్టర్. ఇప్పుడు సీక్వెల్‌కు భారతీరాజా తనయుడు భారతీ కె మనోజ్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం‌. మరో దర్శకుడు రామ్‌ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారట.

ఎక్కువమంది జనంతో షూటింగ్ జరపాల్సి ఉండడంతో ‘మానాడు’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో ‘మానాడు’ చిత్ర ప్రొడ్యూసర్ సురేష్‌ కామాచి, శింబు కలసి కొద్దిమంది నటీనటులతో ఓ స్మాల్‌ బడ్జెట్‌ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read :

తన కల నెరవేరిందంటున్న పాయల్

దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు