రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా డీజే టిల్లు. సిద్దూ జొన్నలగడ్డ యాక్టింగ్.. మేనరిజం, డైలాగ్స్‌కు యూత్‌లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దాదాపు రెండు గంటలు ప్రేక్షకులకు మాస్ కామెడీ వినోదాన్ని అందించాడు సిద్ధు. ఇప్పటికీ టీవీల్లో ఈ మూవీ రిలీజ్ అయితే వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఎక్కువే పెట్టుకున్నారు అడియన్స్. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో ఈ సినిమా పై మరింత హైప్ ఏర్పడింది. దీంతో అటు అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలిరోజే అదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే ఈ మూవీ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 23.7 కోట్ల వసూళ్లు రాబట్టింది రికార్డ్స్ బ్రేక్ చేసింది.
దీంతో ఈమూవీ రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడమే టార్గెట్ అంటూ టిల్లు స్వ్కేర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశాడు. ఇక నిన్న శనివారం వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఓవర్సీస్ లో మొత్తం 45.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టిల్లు క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ కలిపి రూ. 7.50 కోట్లు వరకూ షేర్ కలెక్షన్స్ వచ్చాయని.. రెండు రోజులు కలిపి రూ. 21 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. మొత్తం రెండు రోజులు కలిపి రూ. 45.3 కోట్లు రాబట్టింది ఈ మూవీ.
సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది టిల్లు స్వ్కేర్. ఈ సినిమా యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. మొదటి పార్టులో నేహా శెట్టి నటించగా.. సెకండ్ పార్టులో సిద్దూ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఇందులో అనుపమ గ్లామర్ లుక్స్, యాక్టింగ్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులో మరోసారి నేహా శెట్టి సందడి చేయగా.. మరో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కీలకపాత్రలో కనిపించింది.
Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥
Our Starboy 🌟 continues to shatter records all over! 💥💥
– https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo pic.twitter.com/Y3TeL0adtG
— Sithara Entertainments (@SitharaEnts) March 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.