AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square: బాక్సాఫీస్‏లో టిల్లు స్క్వేర్ మ్యాజిక్.. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా ? సిద్ధుకు తోడుగా ఉన్నది అతడే…

డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 29న గ్రాండ్‎గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేస్తుంది టిల్లు స్క్వేర్. తొలి రోజు తెల్లవారుజామున నుంచి థియేటర్లలో టిల్లు గాడి సందడి మొదలైంది.

Tillu Square: బాక్సాఫీస్‏లో టిల్లు స్క్వేర్ మ్యాజిక్.. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా ?  సిద్ధుకు తోడుగా ఉన్నది అతడే...
Tillu Square, Ravi Antony
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2024 | 9:50 AM

Share

వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనాలకు ఆన్ లిమిటెడ్ కామెడీ ఎంటర్టైనర్ కూల్ చేశాడు సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో డీజే టిల్లు సినిమాతో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన సిద్ధూ.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీతో మరోసారి మ్యాజిక్ చేశాడు. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 29న గ్రాండ్‎గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేస్తుంది టిల్లు స్క్వేర్. తొలి రోజు తెల్లవారుజామున నుంచి థియేటర్లలో టిల్లు గాడి సందడి మొదలైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. అటు యూఎస్‏లోనూ టిల్లు స్క్వేర్ సత్తా చాటుతుంది.

మొదటి రోజే రూ.25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది అంటే మాములు విషయం కాదు. అత్యధిక వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఈ సినిమాకు ఈ ఆదివారం మరింత కలెక్షన్స్ పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా అందులోని డైలాగ్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. డీజే టిల్లుతో జనాలను మెప్పించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమాతో మరోసారి రచయితగానూ సత్తా చాటాడు.

అయితే బాక్సాఫీస్ వద్ద టిల్లు డైలాగ్ మ్యాజిక్‏కు కేరాఫ్ అడ్రస్ సిద్ధూ మాత్రమే కాదు.. మరొకరు ఉన్నారు. టిల్లు పాత్రను ఇంత బాగా తీర్చిదిద్దడంతోపాటు.. యూత్‏ను అలరించే ట్రెండీ డైలాగ్స్ రాయడంలోనూ అతడికి సాయం చేసింద రవి ఆంటోనీ. ఈ పేరు చెబితే జనాలు అంతగా గుర్తుపట్టలేరు..కానీ మ్యాడ్ మూవీ రైటర్ కమ్ యాక్టర్ అంటే ఠక్కున గుర్తుపటేస్తారు. ఈ సినిమాలో ఆంటోనీ అనే పాత్రలో నటించిన నటుడే రవి ఆంటోనీ. వీరిద్దరు డీజే టిల్లు స్క్రిప్ట్ రాశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లల్లోనే వీరిద్దరు స్నేహితులు. టిల్లు స్క్వేర్ లో సిద్దూ, రవి జోడీ పంచులు పేల్చింది. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి టిల్లు స్క్వేర్ 3 తెరకెక్కించనున్నారు. దీంతో పార్ట్ 3పై మరింత అంచనాలు పెరిగాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి