Sruthi Hassan : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది శృతి హాసన్. మధ్యలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది. ప్రజంట్ రవితేజ సరసన క్రాక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ హాట్ బ్యూటీ ఓ వెబ్ ఫిల్మ్ లో నటిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ , ‘మహానటి’ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో శృతి వెబ్ సిరీస్ చేయనున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ ఇటీవల ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుత సినిమాలు, కరోనా ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్టు మొదలుకావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
కాబట్టి ఈ గ్యాపులో ఓ వెబ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ‘నెట్ ఫ్లిక్స్’ వారితో అగ్రిమెంట్ కూడా కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ కూడా వేశారట. దాదాపు ఓ 30 నిమిషాల నిడివి గల ఈ వెబ్ ఫిల్మ్ లో శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
Also Read :