Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

మెగా మేనల్లుళ్ల జోరు !

చిరంజీవి మేనల్లుళ్లు సాయి తేజ్‍, వైష్ణవ్‍ తేజ్‍ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. వైష్ణవ్‍ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా ఇంకా రిలీజ్ కాలేదు.

Chiru's nephew enters Tollywood, మెగా మేనల్లుళ్ల జోరు !

చిరంజీవి మేనల్లుళ్లు సాయి తేజ్‍, వైష్ణవ్‍ తేజ్‍ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. వైష్ణవ్‍ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా ఇంకా రిలీజ్ కాలేదు. ఓటీటీల నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, మొదటి సినిమా కావడంతో ఆ వైపు మొగ్గు చూపలేదు. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండే సినిమా షూటింగ్ మొదలెట్టాడు వైైష్ణవ్.  క్రిష్‍ డైరెక్షన్‍లో ‘కొండ పొలం’ నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా సమయంలో సగం చిత్రీకరణ చేసి నిలిచిపోయిన సినిమాలను ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తే,  వైష్ణవ్ మాత్రం ఏకంగా కొత్త సినిమా షురూ చేశాడు. సాయి తేజ్‍ ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ షూటింగ్‍ కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్‍ ముగిసిన అనంతరం ఈ చిత్రాన్ని జీ 5లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగును అక్టోబర్‍ నుంచి ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేసేలా ప్లాన్‍ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే’ నిర్మాతలకే తేజ్‍ మరో సినిమా చేయడానికి సైన్ చేశాడు.

Also Read :

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్

గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ

 

Related Tags