AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan : అప్పుడు ముంబైలో.. ఇప్పుడు చెన్నైలో.. కొత్త ఇంటి గృహప్రవేశం ఫోటోస్ షేర్ చేసిన శ్రుతి హాసన్..

టాలీవుడ్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సినిమాలు తగ్గించేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చెన్నైలో సొంత ఇల్లు తీసుకుంది. ఆ ఇంటి గృహప్రవేశం ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది శ్రుతి హాసన్.

Shruti Haasan : అప్పుడు ముంబైలో.. ఇప్పుడు చెన్నైలో.. కొత్త ఇంటి గృహప్రవేశం ఫోటోస్ షేర్ చేసిన శ్రుతి హాసన్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2026 | 4:26 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఒకప్పుడు దక్షిణాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. అయితే కొన్నాళ్లుగా శ్రుతిహాసన్ సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చెన్నైలో తన కొత్త ఇంటికి మారారు. సోమావారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో శ్రుతి హాసన్ పాల్గొంది. తన కొత్త ఇంటికి సంబంధించిన గృహప్రవేశ వేడుక ఫోటోస్ ఇన్ స్టాలో పంచుకుంది. ఆ ఫోటోలలో శృతి సాంప్రదాయ దుస్తులు ధరించి నేలపై కూర్చుని పూజ కార్యక్రమాలలో పాల్గొంటూ కనిపించింది. దీంతో అభిమానులు, సినీతారలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఇదిలా ఉంటే.. చెన్నైలో మాత్రమే కాదు.. శ్రుతికి ముంబైలోనూ సొంత ఇల్లు ఉంది. గతేడాది బాలీవుడ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ శ్రుతి హాసన్ ఇంటికి వెళ్లారు. తన యూట్యూబ్ వ్లాగ్ లలో శ్రుతి ఇంటిని చూపిస్తూ దాని గురించి వివరించారు. చాలా మంది సెలబ్రెటీల ఇళ్లలా కాకుండా శ్రుతి హాసన్ అపార్ట్మెంట్ విలాసంవతమైన డిజైన్ ను అనుసరించకుండా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ముంబైలోని తన ఇంటిని శ్రుతి హాసన్ తన అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేసుకుంది. లివింగ్ రూమ్‌ను సంగీతం, భోజనం, విశ్రాంతి కోసం వేర్వేరు ప్రదేశాలుగా డివైడ్ చేసింది. అలాగే ఆ గదులకు ఎత్తైన పైకప్పులు, పెద్ద కిటికీలు, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు, రంగు రంగుల కళాకృతులు, పుష్కలంగా మొక్కలు ఏర్పాటు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

అలాగే గోడలకు ఎలాంటి హడావిడి రంగులు వేయకుండా సింపుల్ గా వదిలేయడం వల్ల ఇంటికి గ్రామీణ రూపు వచ్చింది. ఇంటిలోని ఒక మూలను, సంవత్సరాలుగా సేకరించిన జ్ఞాపికలు, వ్యక్తిగత వస్తువుల కోసం కేటాయించారు. వాటిలో పుస్తకాలు, పోస్టర్లు, యానిమే బొమ్మలు, డిస్కో బాల్స్, ఆమె ప్రయాణాలలో సేకరించిన బాతులు ఆమె తండ్రి కమల్ హాసన్ బహుమతిగా ఇచ్చిన కత్తి ఉన్నాయి. అంతేకాదు.. శ్రుతి ఇంట్లో సంగీతానికి కూడా ప్రధాన స్థానం ఉంది. ఆ ప్రదేశమంతా పియానో, అనేక గిటార్లతో సహా పలు వాద్య పరికరాలతో నిండి ఉంది. ఆ గిటార్లలో ఒకదానిపై గ్యాస్ మాస్క్ డిజైన్ కూడా ఉంది. అంతేకాదు.. తనకు ఇష్టమైన పియానోకు ప్రత్యేకంగా స్థానం ఏర్పాటు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

 శ్రుతి హాసన్ ..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us