దక్షిణాది పరిశ్రమలో హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) స్థానం ప్రత్యేకం. రీఎంట్రీ తర్వాత ఈ అమ్మడు దూకుడు పెంచింది. చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయ్యింది. ప్రస్తుతం శ్రుతి చేతిలో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అందులో ఆమె నటిస్తోన్న సలార్ పాన్ ఇండియా కావడంతో తెగ ఖుషి అవుతున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో ఆద్య పాత్రలో కనిపించనుంది శ్రుతి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఓవైపు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే శ్రుతి.. సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్‌గా ఉంటుంది. లైవ్ చిట్ చాట్స్.. ఫోటోషూట్స్ అంటూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ జంప్‌సూట్‌లో డ్యాన్స్ అదరగొట్టింది.
బ్లాక్ జంప్‌సూట్ ధరించి.. రెండు జడలు..బోల్డ్ మేకప్‌తో క్రేజీ లుక్‌తో ఆకట్టుకుంది. సంతోషంతో డ్యాన్స్ చేస్తూన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే శ్రుతి ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అలాగే డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న మెగా 154లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.