
సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎక్కువ శాతం సినిమా వాళ్లు ఎదుర్కునే మహమ్మారి క్యాన్సర్. ఈ వ్యాధి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది దాని పై పోరాటం చేసి విజయం సాధించారు. రకరకాల క్యాన్సర్ల తో చాలా మంది పోరాడారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, సంజయ్ దత్ ఇలా కొంతంమంది క్యాన్సర్ మహమ్మారిని జయించారు. అలాగే ఇటీవల ఓ స్టార్ హీరో కూడా క్యాన్సర్ ను జయించారు. ఆయన కోసం అభిమానులు ఎన్నో ప్రార్ధనలు చేశారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.
శివరాజ్ కుమార్ త్వరలోనే ఓ స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఆర్ సీ 16 సినిమాలో శివన్న ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. కాగా శివ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. శివరాజ్ కుమార్ ఇటీవలే క్యాన్సర్ ను జయించారు. ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తాజాగా శివన్న క్యాన్సర్ సమయంలో ఎదుర్కున్న పరిస్థితులను పంచుకున్నారు.
ఇది నాకు పునర్జన్మ .. గత డిసెంబర్ లో నేను క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లా.. ఆ సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎంతో భయపడ్డాను. సర్జరీ తర్వాత నేను 5 గంటల తర్వాత స్పృహలోకి వచ్చాను. నేను తిరిగి వస్తానని అనుకోలేదు. ఆ టైంలో నా భార్య చెయ్యి పట్టుకొని నేను మళ్లీ తిరిగి ఇలా చెయ్యి పెట్టుకుంటానని అనుకోలేదు అని భార్యకు చెప్పాను అని అన్నారు శివన్న. చికిత్స తర్వాత నేను తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను అన్నాడు శివన్న.. నాకు ఫోన్ చేసిన నా ఆరోగ్యం గురించి అడిగినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి ప్రేమ ఎవరికి దక్కుతుంది.. చెప్పండి. ఎంత డబ్బు సంపాదించినా.. అభిమానుల ప్రేమను సంపాదించడం కష్టం అని ఎమోషనల్ అయ్యారు శివన్న.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.