Shiva Rajkumar: శివన్నకు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయనను హత్తుకున్నాక 3 రోజులు స్నానం చేయలేదట

శివరాజ్‌కుమార్‌ కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరో గా వెలుగొందుతున్నాడు. ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే కన్నడతో పాటు తరచూ తమిళ్, తెలుగు సినిమాల్లోనూ శివన్న కనిపిస్తుంటారు.

Shiva Rajkumar: శివన్నకు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయనను హత్తుకున్నాక 3 రోజులు స్నానం చేయలేదట
Shiva Rajkumar

Updated on: Dec 16, 2024 | 12:51 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ త్వరలోనే ఓ స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఆర్ సీ 16 సినిమాలో శివన్న ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. కాగా శివ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయనకు ఇష్టమైన హీరోలు కూడా ఉన్నారు. ఈ విషయంపై శివరాజ్‌కుమార్ గతంలోనే మాట్లాడారు. శివన్నకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కమల్ హాసన్ కోలీవుడ్‌లో డిమాండ్ ఉన్న నటుడు. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తమిళంతో పాటు కన్నడ, తెలుగు వంటి భాషల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు కమల్ హాసన్. ఇక శివన్నకి కూడా కమల్ అంటే చాలా ఇష్టమట.

‘నాకు కమల్ హాసన్ అంటే ఇష్టం. నా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు. నన్ను చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు. అప్పాజీ (తండ్రి) మమ్మల్ని పరిచయం కమల్ సార్ కు చేశారు. దీంతో నేను వెంటనే కమల్ హాసన్ ను హత్తుకున్నాను. ఆయన కూడా ఎంతో ప్రేమతో నన్ను హత్తుకున్నారు. ఇది జరిగిన తర్వాత మూడు రోజుల పాటు నేను స్నానం చేయలేదు( నవ్వుతూ). ఆయనంటే నాకు అంతిష్టం’ అని శివరాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కమల్ సార్ అంటే చాలా ఇష్టం..

కాగా శివరాజ్‌కుమార్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోది. అక్కడ ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాలో బిజీ కానున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మీర్జా పూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేంద్ర ఈ మూవీలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.