Jailer: రజనీ కంటే మిమ్మల్ని చూసేందుకే ఆడియెన్స్‌ థియేటర్స్‌కు వస్తున్నారా?.. శివన్న సమాధానమేంటో తెలుసా?

|

Aug 13, 2023 | 9:00 AM

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, శాండల్‌వుడ్‌ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్ మొదటిసారి కలిసి నటించిన సినిమా 'జైలర్'. ఆగస్టు 10న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ భారీ విజయాన్ని అందుకుంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్‌ని క్రాస్ చేసి 200 కోట్ల వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కాగా జైలర్‌ సినిమాలో రజనీకాంతో పాటు శివరాజ్‌కుమార్‌ పాత్ర కూడా జనాలను ఆకట్టుకుంది. ఆయన నరసిహం అనే చిన్న క్యామియోలో కనిపించినప్పటికీ ఆడియెన్స్‌ థ్రిల్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ' జైలర్ ' సినిమా ఘనవిజయం గురించి..

Jailer: రజనీ కంటే మిమ్మల్ని చూసేందుకే ఆడియెన్స్‌ థియేటర్స్‌కు వస్తున్నారా?.. శివన్న సమాధానమేంటో తెలుసా?
Shiva Rajkumar, Rajini Kanth
Follow us on

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, శాండల్‌వుడ్‌ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్ మొదటిసారి కలిసి నటించిన సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ భారీ విజయాన్ని అందుకుంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్‌ని క్రాస్ చేసి 200 కోట్ల వసూళ్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కాగా జైలర్‌ సినిమాలో రజనీకాంతో పాటు శివరాజ్‌కుమార్‌ పాత్ర కూడా జనాలను ఆకట్టుకుంది. ఆయన నరసిహం అనే చిన్న క్యామియోలో కనిపించినప్పటికీ ఆడియెన్స్‌ థ్రిల్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ‘ జైలర్ ‘ సినిమా ఘనవిజయం గురించి, తన పాత్రపై తనకు లభిస్తున్న ప్రశంసల గురించి శివరాజ్ కుమార్ తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నాడు. ‘రజనీకాంత్‌ కంటే మిమ్మల్ని చూసేందుకు థియేటర్‌కి జనాలు ఎక్కువగా వస్తున్నారు’ అన్న ప్రశ్నకు శివన్న నవ్వుతూ బదులిస్తూ.. ‘అయ్యో.. అలా అనకండి, రజనీకాంత్‌ని చూడటమే మాకు సంతోషం. ఈ వయసులోనూ సత్తా ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఇలాంటివి ఆయనే చేయగలడు. రజనీ-రాజ్‌కుమార్‌ల పేర్లు ఆర్‌తో మొదలవుతాయి. వారికి రాజయోగం ఉంది. ఆర్‌తో పేర్లు మొదలయ్యే వారందరూ రాజులే’ అని శివరాజ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.

మనమంతా భారతీయులం..

‘రజనీకాంత్‌తో కలిసి నటించడం మా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నేను అతిధి పాత్రలో నటించినందుకు, ముఖ్యంగా రజనీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా కాంబోను చూసి ప్రజలు కూడా సంతోషంగా ఫీలవుతున్నారు. అది నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల ఆనందం ఇలాగే కొనసాగాలని నా కోరిక. ఆ ఆనందం అన్ని చోట్లా పాజిటివ్‌గా వ్యాపించాలి, అప్పుడే మనం కూడా సంతోషంగా ఉంటాం’ అని శివన్న తెలిపారు.’శివరాజ్‌కుమార్‌ను మాకు ఇవ్వండి’ అని తమిళనాడు సినీ ప్రేమికులు అంటున్నారు కదా? అనే ప్రశ్నకు ‘అదంతా పెద్ద చర్చ, మనం ఎక్కడ ఉన్నా భారతీయులం, భారతదేశం అంతా ఒకటే. అది తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం కావచ్చు. ఆ గర్వం భారతదేశానికి చెందుతుంది వ్యక్తులకు లేదా ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. అందరూ మన ప్రజలే, అందరూ భారతీయులే. అలాగే కళకు భాష ఉండకూడదనేది నా అభిప్రాయం’ అని వినమ్రంగా చెప్పుకొచ్చారీ సీనియర్‌ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.