అంతకు ముందే భారీ అంచనాల మధ్య రిలీజైన జాను సినిమా షాక్ ఇవ్వడం.. ఆ తరువాత శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్లు హ్యాండివ్వడం..! దీంతో చిర్రెత్తుకొచ్చిన శర్వా.. ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఏకంగా శ్రీకారం సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించి తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించారు. శర్వానంద్ హీరోగా బి కిషోర్ డైరెక్షన్లో.. 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా “శ్రీకారం”. సామూహిక వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో ఇటీవల రిలీజైన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. శర్వా క్రేజ్, ప్రియాంక అరుళ్ అందం, మిక్కీజే మేయర్ సంగీతం తోడై ఈ సిమా మంచి వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చారని ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిర్మాదు చేశారు. దాంతో పాటుగా వారికి లీగల్ నోటీసులు పంపించారు.
శ్రీకారం నిర్మాతలు… శర్వాతో సీక్రెట్‌గా మాట్లాడి సమస్యకు ముగింపు పలుకుతారో.. లేక లీగల్‌గాను ముందుకు వెళ్లేందుకే శ్రీకారం చుడతారో చూడాలి మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :