Aadavaallu Meeku Johaarlu: జోరు మీదున్న శర్వానంద్.. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి గుమ్మడి కాయ కొట్టేశాడుగా..

|

Feb 15, 2022 | 9:39 AM

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ (sharwanand) నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు (aadavaallu Meeku Johaarlu).

Aadavaallu Meeku Johaarlu: జోరు మీదున్న శర్వానంద్.. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి గుమ్మడి కాయ కొట్టేశాడుగా..
Sharwanand
Follow us on

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ (sharwanand) నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు (aadavaallu Meeku Johaarlu). ఇందులో శర్వానంద్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేశాయి. డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌కటించారు మేక‌ర్స్‌. మ‌హాశివ‌రాత్రికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న రానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన కొత్త పోస్టర్‌లో శర్వానంద్ తన ఆన్-స్క్రీన్ భార్యకు నమస్కరిస్తున్నట్లు క‌నిపిస్తోంది. రష్మిక మందన్నతో పాటు ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం అంద‌రూ ఈ పోస్ట‌ర్లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఈ సినిమా ఇతివృత్తాన్ని తెలియ‌జేసేలా ఉంది. శర్వా హావభావానికి చాలా మంది మహిళలు అందమైన చిరునవ్వుతో మెరుస్తున్న‌ట్లు పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది.

టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం టైటిల్ సాంగ్‌, టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. వాలెంటెన్స్ డే కానుకగా దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య పాటను నిన్న విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇందులో వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు నటిస్తున్నారు.

Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..

Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్‏గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..

Siddu Jonnalagadda: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డిజె టిల్లు’ టీమ్.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్..

Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..