
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం సామజ వరగమన ఫేమ్ అబ్బరాబు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి సినిమా చేస్తున్నాడు శర్వా. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పేరుతో ఓ మాస్ ఎంటర్ టైన్ చేస్తున్నాడీ ఛార్మింగ్ స్టార్. అలాగే బైకర్ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా శర్వానంద్ కొత్త కారు కొన్నాడు. సుమారు రూ. 2.5 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎం 350H (Lexus LM 350H) అనే అల్ట్రా లగ్జరీ ఎంపీవీని ఈ హీరో కొనుగోలు చేశాడు. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ లెక్సస్ ఎల్ఎం 350H కారు ఇప్పుడు లగ్జరీకి మారు పేరు. విమానంలోని ఫస్ట్-క్లాస్ క్యాబిన్‌ను తలపించేలా ఈ కారు ఇంటీరియర్స్ ఉంటాయి. 48 అంగుళాల భారీ ఎల్ఈడీ స్క్రీన్, పూర్తిగా వెనక్కి వాలే ఎయిర్‌లైన్ స్టైల్ రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్లతో కూడిన మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం మసాజ్ సీట్లు, చిన్న ఫ్రిజ్ వంటి సదుపాయాలు కూడా కల్పించారు. 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది రన్ అవుతుంది.
శర్వానంద్‌కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే అతని గ్యారేజీలో రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ ఐ7, ఆడి క్యూ5 వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు లెక్సస్ ఎల్ఎం 350H కారు కూడా ఈ జాబితాలో చేరింది. శర్వానంద్ తన కొత్త కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకువెళుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సల్వార్ డ్రెస్ లో, పోనీ టెయిల్‌తో చాలా స్టైలిష్‌గా కనిపించాడు శర్వా. దీనిని చూసిన నెటిజన్లు శర్వాకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.
Charming Star #Sharwanand is now the proud owner of a sleek and sophisticated #Lexus car.
Adding a new touch of elegance to his collection. 💥 pic.twitter.com/XpIVnxziLJ
— CHITRAMBHALARE (@chitrambhalareI) December 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.