Sharwanand: టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే అక్కడికి వెళ్తా.. శర్వానంద్ ఆసక్తిర కామెంట్స్

|

Sep 17, 2022 | 9:11 PM

శర్వానంద్(Sharwanand) చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు. వరస ఫ్లాప్ లతో సతమతం అయిన శర్వానంద్ రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Sharwanand: టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే అక్కడికి వెళ్తా.. శర్వానంద్ ఆసక్తిర కామెంట్స్
Sharwanand
Follow us on

శర్వానంద్(Sharwanand) చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు. వరస ఫ్లాప్ లతో సతమతం అయిన శర్వానంద్ రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో హీరో శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.సెన్సిబుల్ సినిమా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవ్వాలని బలంగా అనుకున్నాం. మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది అన్నారు శర్వా.

ఈ సినిమా చేసిన తర్వాత ప్రేక్షకుల కంటే విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారనే భయం వుండేది. ఇలాంటి కథల్లో లాజిక్కులు వెదకడం సులువు. అయితే లక్కీగా విమర్శకులకు కూడా సినిమా నచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ వుండటంతో అందరికీ నచ్చింది. దర్శకుడు హను అయితే ఈ సినిమా పిల్లలకి ఎక్కువ చూపించాలని చెప్పారు. పిల్లల కోసం ఒక స్పెషల్ షో వేశాం. చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. టైం ట్రావెల్ లో ఎక్కడికి వెళ్తారని అడిగితే ప్రజంట్ లోనే వుంటామని చెబుతున్నారు. వాళ్ళంతా ముదుర్లు వాళ్ళ లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే.. ఇంటర్ రోజులకి వెళ్తా. హ్యాపీ డేస్ అవి. రేపటి గురించి ఆలోచన, భవిష్యత్ గురించి చింత ఏమీ వుండేది కాదు. కాలేజ్ బంక్ కొట్టాలి, సినిమాకి వెళ్ళాలి, అటు నుండి దాబాకి వెళ్ళాలి. ఇదే ఆలోచన. నిజంగా గోల్డెన్ డేస్ అన్నారు. నాకు అఖిల్ చిన్నప్పటి నుండి తెలుసు. ఐతే అమల గారు, నాగార్జున గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఈ సినిమాతోనే మొదలైయింది. నిజంగా మూడో కొడుకులానే చూస్తారు. ఈ విషయంలో నేను లక్కీ అన్నారు శర్వానంద్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..