
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, యంగ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. ఇందులో అదితీరావు, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లుగానే.. అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమా ను ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, రామచంద్ర రాజు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా? అంటూ జగపతి బాబును సిద్దార్థ్ నిలదీసే సీన్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. శర్వానంద్‌ను ఉద్దేశించి హీరోయిన్ చెప్పె డైలాగ్.. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా.. అందరూ నీ దగ్గరికే రావాలని అనుకుంటారు.. అలాగే చిన్నప్పుడు దూరదర్శన్‌లో మహా భారతం సీరియల్‌ను చూశాను. ఎత్తులకు పై ఎత్తులు, బాణాలు వేయడం నేర్చుకున్నాను అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా… చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ఈ మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
?CENSOR ALERT?#MahaSamudram ?Crossed the ?????? with ?/? & all set to face the AUDIENCE TIDE on
??? ???? ?? ?????????@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial pic.twitter.com/rLKzlvmE1d— AK Entertainments (@AKentsOfficial) October 8, 2021
Also Read: MAA Elections 2021: బజారున పడి నవ్వుల పాలవుతున్నారు.. మా ఎలక్షన్స్ పై మోహన్ బాబు సంచలన కామెంట్స్..
MAA Elections 2021: మా అధ్యక్ష పదవి కోసం మోనార్క్ vs మంచు.. ఇద్దరి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసా?