Khushboo: ఆసుపత్రి బెడ్ పై ఖుష్బూ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. అసలు ఏం జరిగిందంటే..

|

Oct 08, 2022 | 8:45 AM

ఎప్పుడు ఎంతో చలాకీగా హుషారుగా కనిపించే ఖుష్బూ ఇలా ఉన్నట్టుండి ఆసుపత్రి బెడ్ పై గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Khushboo: ఆసుపత్రి బెడ్ పై ఖుష్బూ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. అసలు ఏం జరిగిందంటే..
Khushbu
Follow us on

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఆకస్మాత్తుగా హాస్పిటల్‏లో చేరారు. ఆసుపత్రి బెడ్ పై నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అసలు విషయం చెప్పేసింది ఖుష్బూ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అగ్రకథానాయికగా రాణించింది. ఆ తర్వాత సహయ పాత్రలలో కూడా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు జడ్జీగా వ్యవహరించడమే కాకుండా.. మరోవైపు రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఎప్పుడు ఎంతో చలాకీగా హుషారుగా కనిపించే ఖుష్బూ ఇలా ఉన్నట్టుండి ఆసుపత్రి బెడ్ పై గుర్తుపట్టలేనంతగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా వెన్నెముక సమస్య వేధిస్తోంది. ఈ కారణంగానే ఆసుపత్రిలో చేరాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ రోజువారీ విధుల్లో పాల్గోంటాను. ఆలస్యంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి. అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో కాఫీ విత్ కాదల్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలకావాల్సి ఉంది. కానీ పొన్నియిన్ సెల్వన్ రాకతో వాయిదా పడింది.

తెలుగులో ఖుష్బూ చివరిగా నటించిన చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన నటించని ఈ మూవీలో రష్మికకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ కామెడీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.