AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: ‘ప్రేమించుకుందాం రా’ సినిమా నా లవ్ స్టోరీనే.. వెంకీ మూవీపై సీనియర్ నటుడి కామెంట్స్..

రాజ్ కుమార్.. ఒకప్పుడు చేతినిండా సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులు మరింత దగ్గరైన నటుడు. అప్పట్లో ఆయనను అందరూ జూనియర్ చిరంజీవి అని పిలిచేవారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు కన్నడలో వరుస మూవీస్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Venkatesh: 'ప్రేమించుకుందాం రా' సినిమా నా లవ్ స్టోరీనే.. వెంకీ మూవీపై సీనియర్ నటుడి కామెంట్స్..
Raj Kumar
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2024 | 8:17 AM

Share

విక్టరీ వెంకటేశ్ సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో ప్రేమించుకుందా రా ఒకటి. 1997లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్ హీరోగా నటించగా.. అంజల జవేరి కథానాయికగా నటించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ లవ్ స్టోరీ అప్పట్లో ఘన విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ టీవీలో ఈ మూవీకి మంచి రెస్పా్న్స్ వస్తుంది. అలాగే ఇందులో వెంకటేశ్ యాక్టింగ్… అంజల జవేరితో ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా తన లవ్ స్టోరే అని అన్నారు సీనియర్ నటుడు రాజ్ కుమార్. బుల్లితెర సినీ ప్రపంచంలోకి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కుమార్.

ఒకప్పుడు ఎన్నో సీరియల్స్.. మరెన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటితరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ.. 90వ దశకంలో వెండితెరపై అలరించారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా పోషించారు. రాజ్ కుమార్ ను అప్పట్లో జూనియర్ చిరంజీవి అని పిలిచేవారు. చాలా కాలంగా ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుమార్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీ లవ్ స్టోరీనే ప్రేమించుకుందాం రా సినిమాగ తీశారంట కదా అని యాంకర్ అడగ్గా.. అవును.. అది నా స్టోరీనే అని అసలు విషయం చెప్పారు రాజ్ కుమార్. ఈ సినిమా కంటే ముందు హైదరాబాద్ లో షిఫ్ట్ ల ప్రకారం పని చేసుకుంటూ బాగా బిజీగా ఉండేవాడినని.. కానీ ఆ సినిమా తన లవ్ స్టోరీ అని తెలిసాక ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అయిపోయిందని అన్నారు. ఆ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. అసలు ప్రేమించుకుందాం రా స్టోరీ నీదేనయ్యా అని అన్నారని.. సినిమా స్టార్టింగ్ లో ఉన్న లవ్ సీన్స్ మాకు జరిగినవే అని.. ఎలా అల్లరి చేశాము.. ఎలా కలిసాం అన్నది మొత్తం చూపించారని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్