Tollywood: ఒకప్పుడు స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్.. ఊహించని విషాదాలు.. ఎన్నో కష్టాలు..
ఈమధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు తమ అభిమాన తారల సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రజలకు చేరువైతున్నాయి. అలాగే నటీనటుల చిన్ననాటి ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ హీరోయిన్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కోని.. వైవిధ్యభరితమైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు సొంతం చేసుకుంది. ఒకప్పుడు తండ్రి స్టార్ హీరో. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే మరణించాడు. దీంతో తల్లి, అన్నయ్యలతో కలిసి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు సోదరుడి మరణం.. ఆమెను మరింతగా కుంగదీశాయి. కానీ ఆ సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ షో కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన అసాధారణ నటనతో టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ వంటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మిక్స్ చేస్తోంది. రియాల్టీ షో ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.
ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె తల్లి నాగమణి ప్రసిద్ధ నృత్యకారిణి. చిన్నతనం నుండి చెన్నైలో పెరిగిన ఆమె.. తన ప్రాథమిక విద్యను హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ నుండి పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఇతిరాజ్ మహిళా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది. తన తల్లి ద్వారా నృత్యంపై ఆసక్తి కలిగి, శిక్షణ పొందిన కళాకారిణి ఐశ్వర్య, టెలివిజన్ షో మానాడ మైలాడ ద్వారా సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే “అసత్తప్ పోవడు ఎవరు” అనే రియాల్టీ షోతో తన మీడియా ప్రయాణాన్ని ప్రారంభించింది.
2010లో పంచ్ భరత్ దర్శకత్వం వహించిన “నీతనా అవన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీతోనే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2017లో మలయాళంలో “జోమొండే సువిసెసమల్” ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత వెట్రి మారన్ దర్శకత్వం వహించిన 2018 చిత్రం “వడ చెన్నై” తమిళ సినిమాలో ఆమె అతిపెద్ద హిట్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ARM మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Ram Charan: అప్పుడేమో క్యూట్‌గా.. ఇప్పుడేమో హాట్‌గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..
Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..
Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.