
సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించారు . అందుకు కారణం ఏంటంటే ..సీనియర్ హీరోయిన్ గౌతమికి చెందిన ఓ భూమిని కొంతమంది కబ్జా చేశారట. సుమారు రూ.25 కోట్ల ధర పలికే ఆ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతమి. అదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని.. తనను , తన కూతురుని చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పోలీసులకు తెలిపారు నటి గౌతమి. నటి గౌతమికి తమిళనాడు లో దాదాపు 50 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయట. అయితే గతకొంతకాలంగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమె వాటిని అమ్మాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఓ ఏజెంట్ ద్వారా తన ఆస్తులను అమ్మకానికి పెట్టారు గౌతమి. అలగప్పన్ అనే ఏజెంట్‌కు తన ఆస్తులను అమ్మాలని కాంటాక్ట్ ఇచ్చారట గౌతమి.
అయితే అలగప్పన్ దురాశతో తన ఆస్తులను కాజేయాలని చూశాడు. నకిలీ పాత్రలతో, ఫోర్జరీ సంతకాలతో 25 కోట్ల విలువ చేసే భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారట. రాజకీయ అండతో అతడు తనను తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపారు గౌతమి.
తన పై బెదిరింపులకు పాల్పడుతున్న అలగప్పన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తన భూమిని కాపాడాలని పోలీసులను కోరారు గౌతమి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గౌతమి తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
హీరోయిన్ గా ఆమె దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. ఇక గౌతమి సందీప్ భాటియా ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సుబ్బలక్ష్మీ అనే కూతురు ఉంది. కొంతకాలం తర్వాత విడిపోయారు. అప్పటి నుంచి గౌతమి కూతురుతో కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం సాగించారు. ఇక ఇప్పుడు ఆమె అడపదడపా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ఓ సినిమాలో నటించారు గౌతమి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.