సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మురారి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది సోనాలీ బింద్రే (sonali bendre). అమాయకపు చూపులతో.. అందం… అభినయంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగింది. దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న సోనాలి.. 2013లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి.. సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత క్యాన్సర్ బారీన పడిన నరకం చూసింది. క్యాన్సర్‌ను జయించి పునర్జన్మ పొందింది. బీటౌన్‌లో పలు టీవీ షోలలో అలరించిన సోనాలీ.. తెలుగులో మాత్రం కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైందట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో సోనాలీ బింద్రే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారట. ఇక ఇదే నిజమైతే.. దాదాపు 18 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సోనాలీ.. ఇటీవలే క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన సోనాలీ.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..
Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..
Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..