దక్షిణాది చిత్రపరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరోయిన్ శోభన. కథానాయికగానే కాదు.. భారతనాట్యం నృత్యకారిణిగానూ తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుతోపాటు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె వయసు 53 ఏళ్లు. అయినా పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యాక పలువురు విద్యార్థులకు క్లాసికల్ డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభన .. ఇటీవల హీరోయిన్ సుహాసిని వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గోన్నారు. ఇందులో తన వ్యక్తిగత జీవితంతోపాటు.. సినీ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు శోభన. సినిమాలో వాన సాంగ్ వచ్చిందంటే.. హీరోయిన్ ను ముందే హత్య చేయడమని అన్నారు.
1989లో రజినీకాంత్ తో కలిసి ఆమె నటించిన చిత్రం శివ. ఈ సినిమా షూటింగ్ సమయంలో రజినీ తన సమస్యలను అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ సినిమాలో వర్షంలో ఓ పాట చిత్రీకరించారట. కానీ ఈ సాంగ్ ఉన్నట్లు ముందు తనకు చెప్పలేదట. తెల్లటి సారీ కట్టుకోవాలని కస్ట్యూమర్ చెప్పడంతో అప్పుడు రెయిన్ సాంగ్ అని అర్థమైందని.. దీంతో ది కాస్ట్యూమ్ గై లోపల వెసుకోవడానికి తన దగ్గర ఏమీ లేదని చెప్పి.. ఇంటికి వెళ్లి ప్రిపేర్ అయ్యి వస్తాను అని అడిగిందట. అందుకు అతను పది నిమిషాల్లోనే షాట్ అని చెప్పాడని తెలిపింది. అందుకే సినిమాలో వాన సాంగ్ ఉందంటే హీరోయిన్ ను ముందే హత్య చేయడమని భావిస్తాను.. ఎందుకంటే ఆ బాధితురాలికి ముందు ఏం తెలియదు కదా అంటూ నవ్వుతూ చెప్పేసింది.
ఈ సాంగ్ ప్రొడక్షన్, షూట్ ఆలస్యం కావడానికి తాను కారణం కాదని… స్టూడియోలో ఉన్న ఓ ప్లాస్టిక్ టేబుల్ కవర్ తీసుకుని దానిని స్కర్ట్ లోపల చుట్టి షాట్ కు సిద్ధమయ్యానని… అలాగే ఆ పాటలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో రజినీ తనకు చాలా సహాయం చేశారని.. అతను నిజంగా జెంటిల్మెన్ అని అన్నారు. అతను సెట్ లో అందరు కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకుంటారని అన్నారు. షూట్ చేస్తున్న సమయంలో రజినీ సర్ నన్ను డ్యాన్స్ స్టెప్ కోసం ఎత్తవలసి వచ్చింది. ఆ సమయంలో కవర్ శబ్దం చేయడం స్టార్ట్ అయ్యింది. దీంతో ఆయన అయోమయంలో పడ్డారు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ విషయం గురించి రజినీ సర్ ఎవరికీ చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చారు శోభన.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.